Saturday, 5 October 2013

                     ఆకతాయి వీడు
                                                  రచన: నముడూరి పవన్
పల్లవి:
ఆకతాయి వీడు, జనం మెచ్చినోడు
పిడికిలెత్తి పిడుగునైన పిప్పి చేస్తాడు
మిర్చిలాంటి కుర్రోడు, నింగి దించుతాడు
పరుగు పెట్టి గమ్యాన్నైనా బ్యాక్కి నెట్టుతాడు
పంచ్ కలిగినోడు, మంచి పంచెటోడు
జనం జోలికొస్తే ఎవడినైనా చేడుగుడాడుతాడు...!   

చరణం1:
బిల్లాని నేనురా, సింహమంటి వాణిరా
నవ్వడం నవ్వించడం రెండే నాకెరుకరా (తెలుసురా)
మా వూళ్ళో డాన్నిరా, నా దారికడ్డురాకురా
నాతో తలపడ్డవాడు పాతాళం చేరురా
మంచి చేస్తే మంచోణి, జాలిగుణం వున్నోణి
అన్ని కలిపి అసలైన ఆంధ్రా మగాడ్ని..

చరణం2:
నిన్న గతం రేపు ఖతం నేడు మాత్రమే నిజం  
అందుకే ప్రతిరోజుని ఖుషి ఖుషిగా గడిపేద్దాం
అందరికీ ఆనందాన్ని పంచెద్దాం.. పెంచెద్దాం
ఒక్కరై ఒక్కొక్కరై విడివిడిగా వుండకురా
నలుగురితో కలిసిపోతూ నడిచిపో సోదరా..!!
ఏరువాక మాత్రం ఒంటరిగా సాగుతోందా
సరదాగా కడదాకా గట్టుతోడు కోరలేదా
మనిషి కుడా అంతేరా, మరో మనిషి తోడురా  
ఐదు వేళ్ళు కలిస్తేనే అదిరేటి పిడికిలిరా.. ఎవ్వరాపలేని శక్తిరా..
                         కాలం నీదంటూ..
                                                                          రచన: నముడూరి పవన్
పల్లవి:

కాలం నీదంటూ అడుగు ముందుకేస్తే
దైవం దిగిరాదా నేల పైకి తుదకు
గమ్యం ఏదైనా అడుగులో అడుగేసే
సత్తువ నీదంటూ లోకమంతా చాటై
అవరోదాలన్ని పాదంతో నెట్టేస్తూ
విజయం వైపుగా నీ పయనం మొత్తం సాగించైరా
నా లోకం ఇది.. నా సొంతం.. అని చెబుతూ
నవ మార్గానికే అడుగై...!!!

చరణం1:
ఓరిమి వుంటే నీలో.. ధైర్యం నీ లోలో
వదలని దీక్షే నీతోడైతే విజయం వరించదా
ధేయం నీలోని దైవంరా
మరి సాహసమంటే నీ సాధనరా
వెలుగును పంచేటి సుర్యుడవై
నింగిన తారని చేరేటి మార్గం వై... మనీషివై

చరణం2:
మనిషికి మనిషే తోడై.. ఒకరికి ఒకరం అయి
కదిలిని సైన్యంలా అనిపిస్తే... భయమే భయపడదా
చెదరని నీ నవ్వే ఆయుధము...
మరి బెదరని నీ చూపే నీ మార్గం
ఆశయమోకటే నీ ఉపిరిగా...
లక్ష్యం సాధించి చుపించై... అందరికీ..!