ప్రేమ
రచన: నముడూరి పవన్
పల్లవి:
అర్ధం కాని ఆశల అలజడి ప్రేమ
వెంటే నడిచే కలల ఉప్పెన ప్రేమ
జవాబు దొరకని ప్రశ్నల వర్షం ప్రేమ
ఉరిమే మబ్బుకి ఉహా చిత్రం ప్రేమ....!
చరణం1:
బంధువనుకుంటే భారమవుతావు
బాధ్యతనుకుంటే బడాయిపోతావు
ఎలా నిన్ను నమ్మేది...!
దూరమవుతుంటే వద్దకొస్తావు
దరికితీస్తుంటే వదిలి పోతావు
ఎలా నిన్ను చేరదీ.....!
ఊరుకుంటే ఉడికిస్తావు
ఊహల మధురిమ అందిస్తావు
ఉన్నమాట చెప్పవుగా ప్రేమ....!
చిక్కకుండా దాగుతావు
చిక్కుముడినే బిగిస్తావు
చిరునవ్వులు నవ్వుట నీ వరమా!
చరణం2:
దాగుడుమూతలు ఆడకు నాతో
దారిని మూసెటి వేదన నీతో
గుండెను చీల్చేటి రంగులు ఎన్నో నీలో!
నిన్నటిదాకా ఒకలాగ
నేడేమైందో మరొకలాగ
అటు ఇటు కాక ఇరుకున పెడితే వేగేదెలాగ !
నీదారేదో నీదేగా..
నీ పంధా మార్చవుగా ప్రేమ!
తికమక కదలిక నీ మహిమ
నీ గతి చేరుట నాతరమా ప్రేమా!
రచన: నముడూరి పవన్
పల్లవి:
అర్ధం కాని ఆశల అలజడి ప్రేమ
వెంటే నడిచే కలల ఉప్పెన ప్రేమ
జవాబు దొరకని ప్రశ్నల వర్షం ప్రేమ
ఉరిమే మబ్బుకి ఉహా చిత్రం ప్రేమ....!
చరణం1:
బంధువనుకుంటే భారమవుతావు
బాధ్యతనుకుంటే బడాయిపోతావు
ఎలా నిన్ను నమ్మేది...!
దూరమవుతుంటే వద్దకొస్తావు
దరికితీస్తుంటే వదిలి పోతావు
ఎలా నిన్ను చేరదీ.....!
ఊరుకుంటే ఉడికిస్తావు
ఊహల మధురిమ అందిస్తావు
ఉన్నమాట చెప్పవుగా ప్రేమ....!
చిక్కకుండా దాగుతావు
చిక్కుముడినే బిగిస్తావు
చిరునవ్వులు నవ్వుట నీ వరమా!
చరణం2:
దాగుడుమూతలు ఆడకు నాతో
దారిని మూసెటి వేదన నీతో
గుండెను చీల్చేటి రంగులు ఎన్నో నీలో!
నిన్నటిదాకా ఒకలాగ
నేడేమైందో మరొకలాగ
అటు ఇటు కాక ఇరుకున పెడితే వేగేదెలాగ !
నీదారేదో నీదేగా..
నీ పంధా మార్చవుగా ప్రేమ!
తికమక కదలిక నీ మహిమ
నీ గతి చేరుట నాతరమా ప్రేమా!
No comments:
Post a Comment