నా heart దొబ్బేసి నవ్వుతావేంటే దొంగ మొహం
ఇన్నాళ్ళు నాతో తిరిగి ఇప్పుడు కాదంటావా దయ్యం మొహం
నీ చేయి అందుకుంటానంటే hand ఇచ్చి పోతావా
ఇక నీతో వేగే ఓపిక లేదు ఛీ పోవే....!
నా life లోకి alive గా దూసుకొచ్చిన రాక్షసి
విడిపోతూ day-by-day నాలో పెంచావు కసి....!
అందగత్తెవనుకుంటూ అంత pose ఎందుకే
అంతలేదు తగ్గు తగ్గు నీ faceకి నేనే ఎక్కువే
Makeupలో నిన్ను చూసి Monalisa అనుకున్నా
మీఇంట్లో Makeup లేని నిన్ను చూసి జడుసుకున్నా
Road లాంటి నా మనసుని dividerలా చేరి ముక్కలు చేశావు
coolగా వున్న నన్ను oven లాంటి నీ ప్రేమతో fry చేశావు
phone bill పేలగొట్టి కుబేరుడిలాంటి నన్ను కుచేలుణ్ణి చేశావు
పులిగోళ్ళు వేసుకునే నేను నా గోళ్ళు తినేంత బికారిని చేశావు
Eytex కాటుకెట్టి, Faceకేమో Cream కొట్టి
Singar బొట్టు పెట్టి, పల్లెటూరి Walk కట్టి
నాకోసం నడిచొచ్చిన అందగత్తె వనుకున్నా
పీడించే రాక్షసివని ఇన్నాళ్ళకు తెలుసుకున్నా
నీకు అందంగా కనపడాలని Hair Oil పెట్టలేదు
ఇప్పుడైనా పెడదామంటే నాకు జుట్టులేదు
నన్నింతగా మార్చిన నిన్ను నరకానికి Nominate చేస్తా
నిన్ను love చేసిన పాపానికి నేను అక్కడికే వస్తా
అక్కడైనా love చేస్తావా.. లేదంటే Atleast ప్రేమిస్తావా....!
.........నముడూరి