Wednesday, 25 January 2012

నా heart దొబ్బేసి

                                      
నా heart దొబ్బేసి నవ్వుతావేంటే దొంగ మొహం
ఇన్నాళ్ళు నాతో తిరిగి ఇప్పుడు కాదంటావా దయ్యం మొహం 
నీ చేయి అందుకుంటానంటే hand ఇచ్చి పోతావా
ఇక నీతో వేగే ఓపిక లేదు ఛీ పోవే....!
నా life లోకి alive గా దూసుకొచ్చిన రాక్షసి 
విడిపోతూ day-by-day నాలో పెంచావు కసి....!

అందగత్తెవనుకుంటూ అంత pose ఎందుకే
అంతలేదు తగ్గు తగ్గు నీ faceకి నేనే ఎక్కువే 
Makeupలో నిన్ను చూసి Monalisa అనుకున్నా 
మీఇంట్లో Makeup లేని నిన్ను చూసి జడుసుకున్నా 
Road లాంటి నా మనసుని dividerలా చేరి ముక్కలు చేశావు  
coolగా వున్న నన్ను oven లాంటి నీ ప్రేమతో fry చేశావు  
phone bill పేలగొట్టి కుబేరుడిలాంటి నన్ను కుచేలుణ్ణి చేశావు  
పులిగోళ్ళు వేసుకునే నేను నా గోళ్ళు తినేంత బికారిని చేశావు 

Eytex కాటుకెట్టి, Faceకేమో Cream కొట్టి
Singar బొట్టు పెట్టి, పల్లెటూరి Walk కట్టి
నాకోసం నడిచొచ్చిన అందగత్తె వనుకున్నా   
పీడించే రాక్షసివని ఇన్నాళ్ళకు తెలుసుకున్నా 
నీకు అందంగా కనపడాలని Hair Oil పెట్టలేదు
ఇప్పుడైనా పెడదామంటే నాకు జుట్టులేదు 
నన్నింతగా మార్చిన నిన్ను నరకానికి Nominate చేస్తా
నిన్ను love చేసిన పాపానికి నేను అక్కడికే వస్తా 
అక్కడైనా love చేస్తావా.. లేదంటే Atleast ప్రేమిస్తావా....!
                                             .........నముడూరి

No comments:

Post a Comment