అలసితి దేవా.. దయగన రావా
ఆర్తితో పిలిచినా.. ఆలకించజాలవా
ముక్కంటి దేవా.. మొరవిన లేవా
మనసుతో కొలిచినా.. మహిమచూపవా....!
గెలుపు కొరకు ఒంటరి పరుగు
ఏకాకినై విసిగిపోయా అలసిపోయా
జలధి మోసేటి జంగమదొరా
నా చిన్ని పని నీకు బరువైనదా
వరములిచ్చెటి భోళాశంకరా
నీ చిన్ని సాయం నాకు కరువైనదా
నోసటన విభూది పూసినా విష సర్పం మెడకు చుట్టినా
ఆప్తులేవారు నీకన్నా అన్యులెవరు తోడన్నా....!
ప్రమధగణం పరివారం గణాధ్యక్షుడు సంతానం
శక్తి రూపిణి సగభాగం ముక్కోటి దేవతలు బంధుజనం
ఎవరికైనా ఉందా ఇంత పెద్ద పరివారం
అయినా నే కోరిన కోర్కేకై ఎందుకింత తాత్సారం
గిరిని పెకలించితినా.. నీకై వేడితి కాని
నిన్నాదేశించితినా.. అర్ధించితి కాని
పసివానిపై పంతమెందుకయ్యా పశుపతి
ఆదరించినా అనుగ్రహించినా నీవేగా కృపానిధి....!
..........నముడూరి
Chala bagundi ... Definitely god will fulfill your wish after hearing this...
ReplyDeleteWhat is your wish??? :)
pavan... its awesome :) chala chala bagundi.. I will be following your blog. Keep publishing such... My best wishes :)
ReplyDeletechala chalaaa nachindi.......
ReplyDelete