అదోలా అవుతున్నట్టుంది..
ఏదో సెగ తాకి నట్టుంది..
మతే చెడి పోతున్నట్టుందీ...నీవల్లే....
సముద్రం పొంగినట్టుంది
మదే చేజారినట్టుంది
మరో కధ మొదలైనట్టుందీ...నీవల్లే....
కిలకిల పలికే కోయిల కుడా వెల వెల బోతోందే
తన మదిచేరని మధురిమ ఏదో నీతోడవుతోందే ... నీవల్లే
అరకు లోయలో గిర గిర తిరిగి పడినట్టవుతోందే
ఎడారిలో నీ శ్వాశ లేక నా ఊపిరి పోతోందే
పెను తుఫానులో అడుగే తడబడి నీ కోసం చూస్తోందే
సునామిలో ఈత రాక నా మనసు మునుగుతోందే......
ప్రేమంటే ఇంతేనా అని నా మనసంటోందే
దరిచేరితే క్షణమైనా నీ సొమ్మేం పోతుందే........
చలి గాలిలో చెలి చెంత లేక చిరు చెమటే పడుతోందే
నడి రాత్రిలో నిదురే రాక నా గుండె ఝల్లుమందే
నిశీధిలో నీ ధ్యాసచేరి నను కలవరపెడుతోందే
అదేమిటో అలజడి రేగి నా పదము కదులుతోందే......
ప్రేమంటే ఇంతేనా అని నా మనసంటోందే
దరిచేరితే క్షణమైనా నీ సొమ్మేం పోతుందే........
........................పవన్
idi songaa? bagundi pavan
ReplyDeletetry chey....