ఏరువాకా సాగినాకా తీరమేదంటె నా మనసు తెలియదన్నాదే
నింగి నెల మధ్య ఊగేటి ఉయ్యాల తీరు అన్నాదే....
ఆనందమే తీరుగా.. ఇన్నాళ్ళు ఉన్నానుగా
ఆకాశమే హద్దుగా... ఆశల్ని పెంచానుగా
ఈనాడే.. నా మదిలో.. రేగింది జ్వాల
అది వేల కాంతులతో నను దాహించేల
తోడనుకున్నా.. తానె నీడనుకున్నా
ఏమయ్యానో.. నాలో నే లేను.... || ఏరువాకా సాగినాకా ||
సన్నజాజులగాలి మెల్ల మెల్లగా చేరి నాతోటి ఈనాడు ఊసులాడిందే
మాట మధ్యలో నన్ను కొంటె కొంటెగ నేడు నీవాడు ఏడంటు పలకరించిందే
ఏమని చెప్పను.. నా కధే చెప్పనా....
అయ్యో పాపం అంటుంది లోకం....
అయో పాపం అంటుంది లోకం.... || ఏరువాకా సాగినాకా ||
పలికేటి గోరింక ఇటు చూసి నావంక నీ మాట నాతోటి పలకంగా
నీ జతే లేదింక అని తనతో చెప్పంగ నను వీడి గూటికే పోవంగా
అందరూ వదిలినా.. వంటరై మిగిలేనా....
వెలుగులే చీకటై ముసురుకోచ్చేనా....
నీజతే లేకుండ నే బ్రతకగలనా.... || ఏరువాకా సాగినాకా ||
................పవన్
No comments:
Post a Comment