Tuesday, 19 July 2011

పెళ్లి

అనురాగామనే పల్లకిలో ఒక్కో పదము ఒక రాగమై
ఆప్యాయతనే చరణములో అర్ధం జీవిత పరమార్ధమై
ఒకరికి ఒకరు తోడంటూ సాగే సాగర గీతం పెళ్లి....!

ఆవేసమనే అంధత్వంలో అభిమానమనే కాగడ తానై
అనుమానమనే అజ్ఞానంలో అనుబంధమనే బంధం తానై
వెలుగులు నింపే  వేవేల దివ్వేలతో  నడిపే నేస్తం పెళ్లి.... !

నిండు జాబిల్లిని  పండు వెన్నెలకి జత చేర్చే సొగసైన దారం పెళ్లి
వెండి మబ్బును వాన ఝల్లుగా మార్చే చల్లని వేణుగానం పెళ్లి
అందాల మెట్టెను  యీ చిట్టి పాదానికి దోస్తీ కలిపే అందాల బంధం పెళ్లి
ఏడడుగుల సాక్షిగా ఇరుమనసులు ఏకం ఇయ్యే తీయని స్నేహం పెళ్లి
మనసున్న మనిషికి మనసైన మనిషితో ముడి పెట్టే కమ్మని కావ్యం పెళ్లి....!

ఇలా నేడు యీ క్షణం కొంతకాలం ఆగిపోని
అలా యీ జంటను మా కన్నులారా చూసుకోని
దేవతలంతా దిగివచ్చి యీ ఆనందాన్ని పంచుకొని
సీతారాముల జంటంటూ లోకం నిత్యం పొగడని....!

స్వర్గంలోనే ఆ బ్రహ్మ ఎవరికీ ఎవరో ముడిపెడతాడు
భువిపై వారిని ప్రతిమలు చేసి ఆటలు ఆడిస్తుంటాడు
ముడిపడు బొమ్మల్ని ఏకం చేసి చిరునవ్వును చిందిస్తాడు
దివినుండే ఆ జంటకు మనసారా తన దీవెనలందిస్తుంటాడు.......!

No comments:

Post a Comment