Sunday, 18 September 2011

నీవల్లే

అదోలా అవుతున్నట్టుంది.. 
ఏదో సెగ తాకి నట్టుంది.. 
మతే  చెడి పోతున్నట్టుందీ...నీవల్లే....
సముద్రం పొంగినట్టుంది
మదే చేజారినట్టుంది
మరో కధ మొదలైనట్టుందీ...నీవల్లే....

కిలకిల పలికే కోయిల కుడా వెల వెల బోతోందే 
తన  మదిచేరని మధురిమ ఏదో నీతోడవుతోందే ... నీవల్లే 

అరకు లోయలో గిర గిర తిరిగి పడినట్టవుతోందే
ఎడారిలో నీ శ్వాశ లేక నా ఊపిరి పోతోందే   
పెను తుఫానులో అడుగే తడబడి నీ కోసం చూస్తోందే
సునామిలో ఈత రాక నా మనసు మునుగుతోందే...... 

ప్రేమంటే ఇంతేనా అని నా మనసంటోందే 
దరిచేరితే క్షణమైనా నీ సొమ్మేం పోతుందే........

చలి గాలిలో చెలి చెంత లేక చిరు చెమటే పడుతోందే
నడి రాత్రిలో నిదురే రాక నా గుండె ఝల్లుమందే
నిశీధిలో నీ ధ్యాసచేరి నను కలవరపెడుతోందే
అదేమిటో అలజడి రేగి నా పదము కదులుతోందే......         

ప్రేమంటే ఇంతేనా అని నా మనసంటోందే 
దరిచేరితే క్షణమైనా నీ సొమ్మేం పోతుందే........

                                                               ........................పవన్ 

Saturday, 17 September 2011

ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....

ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....
సేవాభావం మనిషిలోని ముందు ముఖం
మోసం ద్వేషం వెనుక ఉన్న అసలు నిజం
నిశ్చలంగా నిలిచి ఉన్న నీటి అడుగున మట్టిముద్దలుండవా
దేవుడంటూ పూజించే నాగన్న ఒళ్ళంతా విషపుటేర్లుండవా....!
ఎవ్వరైనా ఇంతే అలా.... కాకుంటే వింతే....

ఎవరి మనుగడ వారికవసరం.... దానికోసం దేనికైనా సిద్ధం..
మనిషికి మనిషే మిత్రుడు అవడం.. ఎవరికి వారె శత్రువు అనడం 
దేవుడైన రాముడు దాగివుండి వాలిపై బాణమెయ్యలేదా..
కురుక్షేత్ర సమరంలో ధర్మరాజు సైతం దొంగ దెబ్బ తీయలేదా....
ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....

ఏ అడవి చుసిన నీతి ఇదే.. ఏ పుటను తిప్పినా శాస్త్రమిదే  
తన బిడ్డను తానె చంపు పులిది సైతం ఇదే మార్గం..
పొట్టకూటికి బాణమొదులు బోయవనిది ఇదే ధర్మం..
ఎంతవాడికైనా త్యాగం ఒక అస్త్రం.. ఆశ దాని ప్రతిఫలం.... 
ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....

                                                               .....పవన్ 

ఓ జాతిపిత మరువలేముగా నీ ఘనత

నీకు నేను నాకు నువ్వు అన్నాగాని
లోకం కోసం ఏకం చేసిన మనీషి గాంధీ
ప్రేమ మమత సత్యం తాగ్యం ఆయుధమంటూ
భారత ఘనతను లోకం మొత్తం చాటెను గాంధీ....

మనిషిలో మానవత్వం.... మనసులో ప్రేమతత్వం....
నింపి ఓ బొమ్మ చేసి ప్రాణమిస్తే అతడే గాంధీ 
స్వరాజ్యమే తన ఊపిరి అనుకుని పోరాడిన గాంధీ
కులమత బేధం సమాధి చేసిన మానవమూర్తి 

మహాత్ముడంటూ నీ ఘనత చెప్పుకు పొతే కొండంత 
అంతేలేని గగనం దాక దూసుకుపోదా నీ గాధా.. ఇది మానవాళికొక చేయూత 
ఇంతై ఇంతై వటుడింతై అన్నతీరుగా కొండంతై
తెల్లదోరలనే గుండె బలముతో ఎదిరించెనుగా ఓ జాతిపితా..
                             మరువలేముగా నీ ఘనత....

                                               ...........పవన్ 

Wednesday, 7 September 2011

అమోఘమౌ అతి సుందరుడు ఈ బాలుడే

యదువంశ కులమున వాసుదేవ సుతుడై జనియించె చక్రి తానె 
మామ ప్రాణములు హరింప హరి తానె అవతరించె దేవకీ గర్భాన 
యశోద డిచేరి ఇచ్చోట నచ్చోట తిరిగి సయ్యాటలాడె గోపికలతోనె 
గోకులము రక్షింప గోపాలుడావేళ గోవర్ధానము లేపి జనుల కాచె....

అమోఘమౌ అతి సుందరుడు ఈ బాలుడే 
అనంతమే నోటన దాచిన గోపాలుడే 
ఆ సుందర రూపం మధురం .... ఆ నందన తేజం అమరం....
కంస ఛేదన కురుక్షేత్రము గీత బోధ గీతమిదే
నా వేణువు పలికిన రాగం ఈ రాగం
గీతా బోధనలోన పార్ధుని ప్రతిభకు ప్రాణం పోసినా 
ధర్మం నిలిపే క్షణమున ద్వంద్వ పలుకుకు జీవం వేసినా 
విశ్వం అంచున విలువలు నిలిపిన భాగవతపు నా గీతం....
అది విశ్వ మానవా సంకేతం....

వక్ష స్థలమున సతిని నిలిపిన వేణు మాధవుని రూపం 
చూపిన నాయద  నేత్రం నాకిది జన్మ జన్మల ఆనందం....
వినీల గగనము విలాస నగరము నాకిది అనన్య సామాన్య భావం
అది విశ్వ మోహనుని వైకుంఠం.... 


                                               ...........పవన్ 

Tuesday, 6 September 2011

O Baby.....


చందమామలోన వున్న అందమంతా నీలోనే ఉందనుకున్నా
సన్నజాజి పువ్వులోన smell అంతా నేతోనే ఉందనుకున్నా 
ఏమైనా.. ఓ మైనా.. నీతోనే ఉండాలనుకున్నా 
తోడైనా.. నీడైనా.. నే నీకోసమే ఇస్తున్నా 
hey baby o baby o baby baby baby baby

ఎందుకోసమో నచ్చావంటే ఎన్నో reasons నే చెప్పుకోనా 
ఎంత చెప్పినా తక్కువే అని నాలోన నాకే వింత భావనా 
ఎవరినైనా నేనోప్పిస్తా.. ప్రాణమంత నీకే అర్పిస్తా ....
నీ చేయి అందిస్తే పట్టేస్తా.. లైఫెంత నీతో గడిపేస్తా....      || baby o baby ||

రెప్పమూసినా .. రెప్ప తెరిచినా infront నీface ఇదేమి యాతనా 
mind తీసినా heart కోసినా నువ్వే surround చేసావన్న భావనా 
అడిగింది లేదనక ఇచేస్తా.. పంచెవన్నె చిలకనైన పట్టిస్తా..
నువ్వంటే అంతగా పడి స్తా.. నువ్వు లేని లైఫ్ వద్దు వదిలేస్తా ..    
                                                                     || baby o baby ||

                                                                      ........పవన్ 

నాన్నా కోసం చిన్ని కవిత


చిటికిన వేలు చూపిస్తూ...
అడుగు అడుగు వేయిస్తూ...
ఒక్కో పదం నేర్పిస్తూ...
చదువులెన్నో చదివిస్తూ...
ఇంతవాడ్ని చేసిన నాన్నా.... 
నిన్ను ఈ జన్మన మరువగలనా....! 

ఆశలన్నీ ఆవిరైనా ఆదుకుంటావు... ఆదిభిక్షువువా
అడుగులెన్ని తడబడినా కాస్తుంటావు... గోపాలునివా
కోర్కేలెన్ని కోరినా తీరుస్తావు.... గోవిందునివా
దగ్గరుండి విద్యా బుద్ధులు నేర్పావు... గణపతివా 
ఏ పేరున నిను పిలిచినా... కాదుగా "నాన్నా" అన్న మాట కన్న మిన్న....!

దేవుడిచ్చిన గొప్పవరం  నువ్వు  
ఇలలో మంచి నేస్తం  నువ్వు
నిరాశలో గుర్తొచ్చే చిరు ఆశ నువ్వు 
కరిగిపోయే కాలంలో నా ధైర్యం నువ్వు....!

నువ్వొక వ్యక్తివంటే కాదంటా... నువ్వే ఒక వ్యక్తిత్వం 
నువ్వొక అడుగువంటే కాదంటా... నువ్వే ఒక మార్గం
నువ్వొక తారవంటే కాదంటా... నువ్వే ఆ ఆకాశం
నువ్వొక ఋషివంటే అవునంటా... నువ్వే నాకాదర్శం

                అందుకే నాన్నా నీకు పుట్టానని గర్వం
               ఏనాడు మరిచిపోకుమా నువ్వే మా సర్వం...........! 



                                                                  ప్రేమతో.........



                                                                    .......... పవన్                  


ఏరువాకా సాగినాకా....

ఏరువాకా సాగినాకా తీరమేదంటె నా మనసు తెలియదన్నాదే
నింగి నెల మధ్య గేటి ఉయ్యాల తీరు అన్నాదే....

ఆనందమే తీరుగా.. ఇన్నాళ్ళు ఉన్నానుగా 
ఆకాశమే హద్దుగా... ఆశల్ని పెంచానుగా 
ఈనాడే.. నా మదిలో.. రేగింది జ్వాల
అది వేల కాంతులతో నను దాహించేల
తోడనుకున్నా.. తానె నీడనుకున్నా 
ఏమయ్యానో.. నాలో నే లేను....                   || ఏరువాకా సాగినాకా ||              

సన్నజాజులగాలి మెల్ల మెల్లగా చేరి నాతోటి ఈనాడు ఊసులాడిందే
మాట మధ్యలో నన్ను కొంటె కొంటెగ నేడు నీవాడు ఏడంటు పలకరించిందే 
ఏమని చెప్పను.. నా కధే చెప్పనా....
అయ్యో పాపం అంటుంది లోకం....
అయో పాపం అంటుంది లోకం....                 || ఏరువాకా సాగినాకా ||

పలికేటి గోరింక ఇటు చూసి నావంక నీ మాట నాతోటి పలకంగా 
నీ జతే లేదింక అని తనతో చెప్పంగ నను వీడి గూటికే పోవంగా 
అందరూ వదిలినా.. వంటరై మిగిలేనా....
వెలుగులే చీకటై ముసురుకోచ్చేనా....
నీజతే లేకుండ నే బ్రతకగలనా....                  || ఏరువాకా సాగినాకా ||



                                                     ................పవన్