అందమైన ఏ సాయంత్రం.. నా మదిలో ఒక చిన్ని రాగం
వినపడుతోందా నా మౌనం.. మనసంతా నువ్వే అనిదానర్ధం
తనపై ప్రేమో ఏమో తెలియని వైనం.. తన జతలో ఏదో తెలియని ఆనందం
చల్లని మేఘమా తనకి తెలుపుమా నా మనసులోని భావం
సంధ్యా రాగమా ధైర్యం చెప్పుమా నా పెదవి వీడనంటోంది మౌనం
నా గుండె ప్రతిక్షణం తనకోసమే తపిస్తోంది
నా అడుగు నిరంతరం తనకేసే నడుస్తోంది
నా మనసు తనతో మాటాడి ప్రేమ తెలుపుతానంటోంది
కన్ను కన్నుతో జతకట్టి జవాబుకై ఎదురుచూస్తోంది
నా పాదం తనతో ఏడడుగులూ నడవాలని ఆరాటపడుతోంది
నా మౌన వేదన తన దరి చేరిందా
ఈ మధుర భావన తనలో కూడా దాగుందా
ఇది ప్రేమే అని తనకైనా తెలిసిందా.....
...............పవన్