అందని నింగివో అందే నేలవో
..............పవన్
అందీ అందని ఆశవో
ఎవ్వరు నువ్వో ఏమైపోయావో
తెలుసుకోలేక తలచుకుంటున్నా
తెలుసుకోవాలని తపనపడుతున్నా....
ఎన్నాళ్ళు గడిచినా నీ మాట వినక
ఎన్నేళ్ళు వేచినా నువ్వు కానరాక
ఎన్నాలైనా నిన్ను చూసి
నిన్నో మొన్నో చూసినట్టుంది
ఎన్ని నెలలైనా నిన్ను కలిసి
నీ ధ్యాసలోనే మనసు గడుపుతోంది.....
కలవా.... కనుమరుగైపోయావు
కన్నీరువా... కరిగిపోయావు
ఎదురుచుస్తూ కలవరిస్తూ
నీకోసం వేచి ఉంటా
ఏనాటికైనా నిన్ను చేరుకుంటా....
..............పవన్
No comments:
Post a Comment