వీళ్ళా మనుషులు వీళ్ళా మనుషులు
చెబుతా వినండి వారి బ్రతుకులు........
మొహమ్మీద ఉమ్ముపడితే తుడుచుకుపోతున్నారు
నెత్తిమీద పిడుగు పడితే నాకేమని పోతున్నారు
తప్పు ఒప్పులుంటాయని ఎప్పుడో మరిచారు
సిగ్గు ఎగ్గులెందుకులే అని గాలికి వదిలేశారు
మనిషి చచ్చిపోతుంటే చిత్రం చూస్తుంటారు
మనసు ఛిద్రమవుతున్నా పట్టనట్టు పోతారు
పేద ప్రజల గుండె చీల్చి లంచాలని కొందరు
ఎగిరిపడ్డ ఎంగిలాకు ఏరుకుతిని కొందరు
చావలేక బ్రతకలేక బ్రతుకుతున్న కొందరు
రకరకాల ముసుగులేస్తూ మరి కొందరు
పాలకులను గాడిదల్లె మోస్తున్నవారేగా అందరూ
బానిసల్లె బ్రతుకుతూ బ్రతుకు బండి లాగిస్తూ
ఇంకా ఎన్నాళ్ళు....
ఇంకా ఎన్నేళ్ళు ....
........................పవన్
చెబుతా వినండి వారి బ్రతుకులు........
మొహమ్మీద ఉమ్ముపడితే తుడుచుకుపోతున్నారు
నెత్తిమీద పిడుగు పడితే నాకేమని పోతున్నారు
తప్పు ఒప్పులుంటాయని ఎప్పుడో మరిచారు
సిగ్గు ఎగ్గులెందుకులే అని గాలికి వదిలేశారు
మనిషి చచ్చిపోతుంటే చిత్రం చూస్తుంటారు
మనసు ఛిద్రమవుతున్నా పట్టనట్టు పోతారు
పేద ప్రజల గుండె చీల్చి లంచాలని కొందరు
ఎగిరిపడ్డ ఎంగిలాకు ఏరుకుతిని కొందరు
చావలేక బ్రతకలేక బ్రతుకుతున్న కొందరు
రకరకాల ముసుగులేస్తూ మరి కొందరు
పాలకులను గాడిదల్లె మోస్తున్నవారేగా అందరూ
బానిసల్లె బ్రతుకుతూ బ్రతుకు బండి లాగిస్తూ
ఇంకా ఎన్నాళ్ళు....
ఇంకా ఎన్నేళ్ళు ....
........................పవన్
No comments:
Post a Comment