నీ జడకోప్పున రోజాలా ఎందుకు
నీ పాపిట సింధూరం నూరేళ్ళు నీతోనే ఉంటా
నీ వెంటే నీడలా వెలుగులో మాత్రమే ఎందుకు
నువ్వు పీల్చే శ్వాసలా అనుక్షణం నేతోనే ఉంటా.....
తుమ్మేదను కాను నేను.. పువ్వు పువ్వు పై వాలిపోను
కన్నీరును కాను నేను.. కష్టాలలో నిన్నోదిలిపోను
నాలో సగం కావు నువ్వు.. నేనే నువ్వై పోయావు
కన్నులలో నేవే నిండావు.. నాకు ఎటు చూసినా నువ్వే కనపడుతున్నావు....
నీ వెలి మెట్టెలా నేతోనే ఉంటానునీ గుండె చప్పుడులా నేలోనే ఉంటాను
నీ కాలి మువ్వలా నీకోసం సవ్వడి చేస్తాను
నీ మెడలో సూత్రంల నిత్యం నీ హృదయంలో దాగి ఉంటాను....
............పవన్
wife gurinchi rasina e kavitha nakento nachindi....
ReplyDelete