ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....
సేవాభావం మనిషిలోని ముందు ముఖం
మోసం ద్వేషం వెనుక ఉన్న అసలు నిజం
నిశ్చలంగా నిలిచి ఉన్న నీటి అడుగున మట్టిముద్దలుండవా
దేవుడంటూ పూజించే నాగన్న ఒళ్ళంతా విషపుటేర్లుండవా....!
ఎవ్వరైనా ఇంతే అలా.... కాకుంటే వింతే....
ఎవరి మనుగడ వారికవసరం.... దానికోసం దేనికైనా సిద్ధం..
మనిషికి మనిషే మిత్రుడు అవడం.. ఎవరికి వారె శత్రువు అనడం
దేవుడైన రాముడు దాగివుండి వాలిపై బాణమెయ్యలేదా..
కురుక్షేత్ర సమరంలో ధర్మరాజు సైతం దొంగ దెబ్బ తీయలేదా....
ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....
ఏ అడవి చుసిన నీతి ఇదే.. ఏ పుటను తిప్పినా శాస్త్రమిదే
తన బిడ్డను తానె చంపు పులిది సైతం ఇదే మార్గం..
పొట్టకూటికి బాణమొదులు బోయవనిది ఇదే ధర్మం..
ఎంతవాడికైనా త్యాగం ఒక అస్త్రం.. ఆశ దాని ప్రతిఫలం....
ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....
.....పవన్
Nijame evaraina inte ...
ReplyDelete