Friday, 16 December 2011

ఓ మనిషీ

            
పీకలదాకా కూరుకుపోయిన మనిషీ ఇక లే
బంధాలు బాంధవ్యాలు వెంటరావు వదిలి లే
కనులే వెలుగై చూపే దారిలో పొదువు పడ లే
కాటుక చీకటి చీల్చుకు వచ్చే ఆదిత్యుడవై లే
కాలం వేగం పెంచుకుపోతోంది గాధ నిద్ర విడిచి లే
 స్వప్నసాగరం ముంచెలోగా మగతనొదిలి ముందు లే........!

మందకొడిగా సాగితే ప్రళయం ముంచుకొచ్చేస్తుంది పద పద
ఆలోచిస్తూ కూర్చుంటే అంతేక్కడుందో తెలియదుకద పద
నీ నీడే పోటీగా నిను దాటాలని చూస్తోంది త్వరపడి పద పద
ఆకలితో ఆశగా చూసే నోళ్ళున్నాయి ఆదమరిస్తే స్వహ అంటాయి
వాటి కంట పడకుండా జర భద్రంగా పద
చుట్టూ ఎన్నో ముళ్లున్నాయి తప్పటడుగేస్తే నీ రక్తం తాగుతాయి
ధ్యాసే శ్వాసగా ఆచితూచి అడుగేస్తూ పద పద........!

                                                        .........నముడూరి

Tuesday, 18 October 2011

అలసితి దేవా.. దయగన రావా

అలసితి దేవా.. దయగన రావా 
ఆర్తితో పిలిచినా.. ఆలకించజాలవా 
ముక్కంటి దేవా.. మొరవిన లేవా 
మనసుతో కొలిచినా.. మహిమచూపవా....!

గెలుపు కొరకు ఒంటరి పరుగు
ఏకాకినై విసిగిపోయా అలసిపోయా 
జలధి మోసేటి జంగమదొరా
నా చిన్ని పని నీకు బరువైనదా
వరములిచ్చెటి భోళాశంకరా
నీ చిన్ని సాయం నాకు కరువైనదా
నోసటన విభూది పూసినా  విష సర్పం మెడకు చుట్టినా 
ఆప్తులేవారు నీకన్నా అన్యులెవరు తోడన్నా....!

ప్రమధగణం పరివారం గణాధ్యక్షుడు సంతానం 
శక్తి రూపిణి సగభాగం ముక్కోటి దేవతలు బంధుజనం 
ఎవరికైనా ఉందా ఇంత పెద్ద పరివారం
అయినా నే కోరిన కోర్కేకై ఎందుకింత తాత్సారం
గిరిని పెకలించితినా.. నీకై వేడితి  కాని 
నిన్నాదేశించితినా.. అర్ధించితి కాని
పసివానిపై పంతమెందుకయ్యా  పశుపతి 
ఆదరించినా అనుగ్రహించినా నీవేగా కృపానిధి....! 

                                                                        ..........నముడూరి

Sunday, 18 September 2011

నీవల్లే

అదోలా అవుతున్నట్టుంది.. 
ఏదో సెగ తాకి నట్టుంది.. 
మతే  చెడి పోతున్నట్టుందీ...నీవల్లే....
సముద్రం పొంగినట్టుంది
మదే చేజారినట్టుంది
మరో కధ మొదలైనట్టుందీ...నీవల్లే....

కిలకిల పలికే కోయిల కుడా వెల వెల బోతోందే 
తన  మదిచేరని మధురిమ ఏదో నీతోడవుతోందే ... నీవల్లే 

అరకు లోయలో గిర గిర తిరిగి పడినట్టవుతోందే
ఎడారిలో నీ శ్వాశ లేక నా ఊపిరి పోతోందే   
పెను తుఫానులో అడుగే తడబడి నీ కోసం చూస్తోందే
సునామిలో ఈత రాక నా మనసు మునుగుతోందే...... 

ప్రేమంటే ఇంతేనా అని నా మనసంటోందే 
దరిచేరితే క్షణమైనా నీ సొమ్మేం పోతుందే........

చలి గాలిలో చెలి చెంత లేక చిరు చెమటే పడుతోందే
నడి రాత్రిలో నిదురే రాక నా గుండె ఝల్లుమందే
నిశీధిలో నీ ధ్యాసచేరి నను కలవరపెడుతోందే
అదేమిటో అలజడి రేగి నా పదము కదులుతోందే......         

ప్రేమంటే ఇంతేనా అని నా మనసంటోందే 
దరిచేరితే క్షణమైనా నీ సొమ్మేం పోతుందే........

                                                               ........................పవన్ 

Saturday, 17 September 2011

ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....

ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....
సేవాభావం మనిషిలోని ముందు ముఖం
మోసం ద్వేషం వెనుక ఉన్న అసలు నిజం
నిశ్చలంగా నిలిచి ఉన్న నీటి అడుగున మట్టిముద్దలుండవా
దేవుడంటూ పూజించే నాగన్న ఒళ్ళంతా విషపుటేర్లుండవా....!
ఎవ్వరైనా ఇంతే అలా.... కాకుంటే వింతే....

ఎవరి మనుగడ వారికవసరం.... దానికోసం దేనికైనా సిద్ధం..
మనిషికి మనిషే మిత్రుడు అవడం.. ఎవరికి వారె శత్రువు అనడం 
దేవుడైన రాముడు దాగివుండి వాలిపై బాణమెయ్యలేదా..
కురుక్షేత్ర సమరంలో ధర్మరాజు సైతం దొంగ దెబ్బ తీయలేదా....
ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....

ఏ అడవి చుసిన నీతి ఇదే.. ఏ పుటను తిప్పినా శాస్త్రమిదే  
తన బిడ్డను తానె చంపు పులిది సైతం ఇదే మార్గం..
పొట్టకూటికి బాణమొదులు బోయవనిది ఇదే ధర్మం..
ఎంతవాడికైనా త్యాగం ఒక అస్త్రం.. ఆశ దాని ప్రతిఫలం.... 
ఎవ్వరైనా ఇంతే.... అలా కాకుంటే వింతే....

                                                               .....పవన్ 

ఓ జాతిపిత మరువలేముగా నీ ఘనత

నీకు నేను నాకు నువ్వు అన్నాగాని
లోకం కోసం ఏకం చేసిన మనీషి గాంధీ
ప్రేమ మమత సత్యం తాగ్యం ఆయుధమంటూ
భారత ఘనతను లోకం మొత్తం చాటెను గాంధీ....

మనిషిలో మానవత్వం.... మనసులో ప్రేమతత్వం....
నింపి ఓ బొమ్మ చేసి ప్రాణమిస్తే అతడే గాంధీ 
స్వరాజ్యమే తన ఊపిరి అనుకుని పోరాడిన గాంధీ
కులమత బేధం సమాధి చేసిన మానవమూర్తి 

మహాత్ముడంటూ నీ ఘనత చెప్పుకు పొతే కొండంత 
అంతేలేని గగనం దాక దూసుకుపోదా నీ గాధా.. ఇది మానవాళికొక చేయూత 
ఇంతై ఇంతై వటుడింతై అన్నతీరుగా కొండంతై
తెల్లదోరలనే గుండె బలముతో ఎదిరించెనుగా ఓ జాతిపితా..
                             మరువలేముగా నీ ఘనత....

                                               ...........పవన్ 

Wednesday, 7 September 2011

అమోఘమౌ అతి సుందరుడు ఈ బాలుడే

యదువంశ కులమున వాసుదేవ సుతుడై జనియించె చక్రి తానె 
మామ ప్రాణములు హరింప హరి తానె అవతరించె దేవకీ గర్భాన 
యశోద డిచేరి ఇచ్చోట నచ్చోట తిరిగి సయ్యాటలాడె గోపికలతోనె 
గోకులము రక్షింప గోపాలుడావేళ గోవర్ధానము లేపి జనుల కాచె....

అమోఘమౌ అతి సుందరుడు ఈ బాలుడే 
అనంతమే నోటన దాచిన గోపాలుడే 
ఆ సుందర రూపం మధురం .... ఆ నందన తేజం అమరం....
కంస ఛేదన కురుక్షేత్రము గీత బోధ గీతమిదే
నా వేణువు పలికిన రాగం ఈ రాగం
గీతా బోధనలోన పార్ధుని ప్రతిభకు ప్రాణం పోసినా 
ధర్మం నిలిపే క్షణమున ద్వంద్వ పలుకుకు జీవం వేసినా 
విశ్వం అంచున విలువలు నిలిపిన భాగవతపు నా గీతం....
అది విశ్వ మానవా సంకేతం....

వక్ష స్థలమున సతిని నిలిపిన వేణు మాధవుని రూపం 
చూపిన నాయద  నేత్రం నాకిది జన్మ జన్మల ఆనందం....
వినీల గగనము విలాస నగరము నాకిది అనన్య సామాన్య భావం
అది విశ్వ మోహనుని వైకుంఠం.... 


                                               ...........పవన్ 

Tuesday, 6 September 2011

O Baby.....


చందమామలోన వున్న అందమంతా నీలోనే ఉందనుకున్నా
సన్నజాజి పువ్వులోన smell అంతా నేతోనే ఉందనుకున్నా 
ఏమైనా.. ఓ మైనా.. నీతోనే ఉండాలనుకున్నా 
తోడైనా.. నీడైనా.. నే నీకోసమే ఇస్తున్నా 
hey baby o baby o baby baby baby baby

ఎందుకోసమో నచ్చావంటే ఎన్నో reasons నే చెప్పుకోనా 
ఎంత చెప్పినా తక్కువే అని నాలోన నాకే వింత భావనా 
ఎవరినైనా నేనోప్పిస్తా.. ప్రాణమంత నీకే అర్పిస్తా ....
నీ చేయి అందిస్తే పట్టేస్తా.. లైఫెంత నీతో గడిపేస్తా....      || baby o baby ||

రెప్పమూసినా .. రెప్ప తెరిచినా infront నీface ఇదేమి యాతనా 
mind తీసినా heart కోసినా నువ్వే surround చేసావన్న భావనా 
అడిగింది లేదనక ఇచేస్తా.. పంచెవన్నె చిలకనైన పట్టిస్తా..
నువ్వంటే అంతగా పడి స్తా.. నువ్వు లేని లైఫ్ వద్దు వదిలేస్తా ..    
                                                                     || baby o baby ||

                                                                      ........పవన్ 

నాన్నా కోసం చిన్ని కవిత


చిటికిన వేలు చూపిస్తూ...
అడుగు అడుగు వేయిస్తూ...
ఒక్కో పదం నేర్పిస్తూ...
చదువులెన్నో చదివిస్తూ...
ఇంతవాడ్ని చేసిన నాన్నా.... 
నిన్ను ఈ జన్మన మరువగలనా....! 

ఆశలన్నీ ఆవిరైనా ఆదుకుంటావు... ఆదిభిక్షువువా
అడుగులెన్ని తడబడినా కాస్తుంటావు... గోపాలునివా
కోర్కేలెన్ని కోరినా తీరుస్తావు.... గోవిందునివా
దగ్గరుండి విద్యా బుద్ధులు నేర్పావు... గణపతివా 
ఏ పేరున నిను పిలిచినా... కాదుగా "నాన్నా" అన్న మాట కన్న మిన్న....!

దేవుడిచ్చిన గొప్పవరం  నువ్వు  
ఇలలో మంచి నేస్తం  నువ్వు
నిరాశలో గుర్తొచ్చే చిరు ఆశ నువ్వు 
కరిగిపోయే కాలంలో నా ధైర్యం నువ్వు....!

నువ్వొక వ్యక్తివంటే కాదంటా... నువ్వే ఒక వ్యక్తిత్వం 
నువ్వొక అడుగువంటే కాదంటా... నువ్వే ఒక మార్గం
నువ్వొక తారవంటే కాదంటా... నువ్వే ఆ ఆకాశం
నువ్వొక ఋషివంటే అవునంటా... నువ్వే నాకాదర్శం

                అందుకే నాన్నా నీకు పుట్టానని గర్వం
               ఏనాడు మరిచిపోకుమా నువ్వే మా సర్వం...........! 



                                                                  ప్రేమతో.........



                                                                    .......... పవన్                  


ఏరువాకా సాగినాకా....

ఏరువాకా సాగినాకా తీరమేదంటె నా మనసు తెలియదన్నాదే
నింగి నెల మధ్య గేటి ఉయ్యాల తీరు అన్నాదే....

ఆనందమే తీరుగా.. ఇన్నాళ్ళు ఉన్నానుగా 
ఆకాశమే హద్దుగా... ఆశల్ని పెంచానుగా 
ఈనాడే.. నా మదిలో.. రేగింది జ్వాల
అది వేల కాంతులతో నను దాహించేల
తోడనుకున్నా.. తానె నీడనుకున్నా 
ఏమయ్యానో.. నాలో నే లేను....                   || ఏరువాకా సాగినాకా ||              

సన్నజాజులగాలి మెల్ల మెల్లగా చేరి నాతోటి ఈనాడు ఊసులాడిందే
మాట మధ్యలో నన్ను కొంటె కొంటెగ నేడు నీవాడు ఏడంటు పలకరించిందే 
ఏమని చెప్పను.. నా కధే చెప్పనా....
అయ్యో పాపం అంటుంది లోకం....
అయో పాపం అంటుంది లోకం....                 || ఏరువాకా సాగినాకా ||

పలికేటి గోరింక ఇటు చూసి నావంక నీ మాట నాతోటి పలకంగా 
నీ జతే లేదింక అని తనతో చెప్పంగ నను వీడి గూటికే పోవంగా 
అందరూ వదిలినా.. వంటరై మిగిలేనా....
వెలుగులే చీకటై ముసురుకోచ్చేనా....
నీజతే లేకుండ నే బ్రతకగలనా....                  || ఏరువాకా సాగినాకా ||



                                                     ................పవన్  

Wednesday, 17 August 2011

పెళ్లి..... మేని వగలు ఈ చినదాని హొయలు

మేని వగలు ఈ చినదాని హొయలు
సిగ్గు దొంతరలు ఆమె లోలోన పొరలు
ఇన్నాళ్ళుగా కలలు కంటున్నఎన్నెన్నో కలలు
ఇకపై నిజాలై నిత్యం నీ ముంగిట మెదులు.....!
నాలో సగం ఏదంటూ వరుని కన్నులు
తెరవెనుక చేసే చిలిపి చేష్టలు
సరదా సంబరాల ముత్యాల కేరింతలు
నిలిచి ఉండాలి జన్మంతా ఈ ఆనంద క్షణాలు....!
హరివిల్లులోని రంగుల్ని అన్ని ముంగిట నిలిపి ముగ్గులు వేసి
గగనాన్ని దింపి భువిపైకి తెచ్చి ప్రపంచమంతా పందిరి వేసి
సరిగామలలోని మధురిమలు అన్ని సన్నాయి అయ్యి సందడిని చేసి
దేవుళ్ళు సైతం అతిధులై చేరి అక్షింతలేయ ఈ జంటను చూసి.........!
                                                                                     ...........పవన్

Friday, 5 August 2011

లింగంపల్లి జంక్షన్లో.... రెండో పోర్షన్ ఇంటిలో

లింగంపల్లి జంక్షన్లో
రెండో పోర్షన్ ఇంటిలో 
అద్దెకు దిగారు యువకులు నలుగురు 
పేరుకేమో బ్యాచిలర్స్ 
గొడవలకేమో నో ఫికర్స్ 
మీసం లేని రోమియోస్

కిటికీ పక్కన బుక్కేసి 
కనపడకుండా నక్కేసి 
నచ్చిన పిల్లకి లుక్కేసి 
day and night మరిచారే సైటేసి

రోజాలాంటి అమ్మాయి రోడ్డ్  మీదే పోతోంది
కిటికిలోంచే కనిపించి కవ్విస్తోందండి 
వీధి వీధి గాలించి నీర్సమొచ్చి కూర్చుంటే ఆమె ఇల్లే కనిపించిందండి 

జంక్షన్ లోనే మాటేశారు
జిందగి మొత్తం నువ్వన్నారు
రోజపువ్వే ఇచ్చేశారు
ఆమె చెయ్యే పట్టేశారు 
అన్నని చూసి shock అయ్యారు 
sorry అంటూ side అయ్యారు 
పళ్ళుడాకే ఇంటికి వచ్చారు 

feel కాకండి figureరేగ పోయింది
కిటికీ ఇంకా తెరిచే ఉంది చుడండి
అన్నవల్లేగా  గొడవంతా జరిగింది 
brothers లేని పిల్లకి బీటు కొట్టండి 
ఈ scheme బాగుంది.. తొందరగా వెతకండి
కట్నం తెచ్చే పిల్లైతే ఇంకా betterరండి 
కోతి బుద్ధండి.. కట్నం ఇవ్వండి
పిల్లకి ఎన్ని లోపాలున్నా పరవాలేదండి

                                               .............పవన్ 

Thursday, 4 August 2011

ప్రేమించిన వ్యక్తి దూరమైతే ??????

కరిగిన నింగి వర్షింది 
ఆ వరదే నా మదిలో ఉప్పెనలా పొంగింది.....

నిన్నటిదాకా నా ధైర్యం
                 ఈనాడే విడిపోయిందని..
వేకువ ఝామున హృదయంలో 
                 చీకటి ముసురే కమ్మిందని
వెన్నెల వెలుగుల ఆనందంలో 
                 ఎడారి వేడే తగిలిందని..
తెలుసుకున్న నామనసే నింగికేసి చూసింది
ఆ చూపుకు ఆ నింగే చినుకు చినుకు రాల్చింది
ఆ వానే జడివానై నా మదిలో ఉప్పెనల్లె పొంగింది....

గడిచిన కాలం గుర్తొస్తే ప్రతిక్షణం మన కధలే చెప్పింది 
నడిచిన బాటను గమనిస్తే ప్రతి అడుగు మన కదలికే చూపింది 
అందని ద్రాక్షని ఆశించా అని నాలో నాకే కలవరం
నువ్వులేని నిరాశలో ఏమవుతానో అని చిన్న భయం.... 

                                                 ............పవన్ 
 

Wednesday, 3 August 2011

నిన్నే దరిచేరి అది తెలుసుకోమంటోంది

సిరివెన్నెల వసంతం ఈనాడే విరిసిందా
మరుమల్లెల సుగంధం ఈ ఇంటన పంచిందా
కలవో కధవో ఏ శిల్పి చెక్కిన శిల్పానివో
నా మదిలో కలలా మెదిలే సౌందర్య రూపనివొ....

కనురెప్పలు ఎటుతిప్పిన నీ మోము చూపుతుంటే 
మనసెప్పుడు సరికొత్తగ నీ ధ్యాసలో ఉంటే
ఇదేమి మధుర భావన, ఇదేమి వింత యాతన
ఏదిక్కున ఎటు చూసిన నీ రూపురేఖలుంటే.... 

అది చూసిన నా మనసే నిత్యం నిను చేరుతుంటే 
ఇదేమి విరహ వేదన ఇదేమి తీపి యాతన....

ప్రతిరోజూ చూస్తున్నా నీకేసి
ఈ రోజే కలిగిందో వింత అనుభూతి
మదిలోని ఆ భావం లోలోపల దాగుంది
నిన్నే దరిచేరి అది తెలుసుకోమంటోంది.... 


                                               ...........పవన్ 

Tuesday, 19 July 2011

పెళ్లి

అనురాగామనే పల్లకిలో ఒక్కో పదము ఒక రాగమై
ఆప్యాయతనే చరణములో అర్ధం జీవిత పరమార్ధమై
ఒకరికి ఒకరు తోడంటూ సాగే సాగర గీతం పెళ్లి....!

ఆవేసమనే అంధత్వంలో అభిమానమనే కాగడ తానై
అనుమానమనే అజ్ఞానంలో అనుబంధమనే బంధం తానై
వెలుగులు నింపే  వేవేల దివ్వేలతో  నడిపే నేస్తం పెళ్లి.... !

నిండు జాబిల్లిని  పండు వెన్నెలకి జత చేర్చే సొగసైన దారం పెళ్లి
వెండి మబ్బును వాన ఝల్లుగా మార్చే చల్లని వేణుగానం పెళ్లి
అందాల మెట్టెను  యీ చిట్టి పాదానికి దోస్తీ కలిపే అందాల బంధం పెళ్లి
ఏడడుగుల సాక్షిగా ఇరుమనసులు ఏకం ఇయ్యే తీయని స్నేహం పెళ్లి
మనసున్న మనిషికి మనసైన మనిషితో ముడి పెట్టే కమ్మని కావ్యం పెళ్లి....!

ఇలా నేడు యీ క్షణం కొంతకాలం ఆగిపోని
అలా యీ జంటను మా కన్నులారా చూసుకోని
దేవతలంతా దిగివచ్చి యీ ఆనందాన్ని పంచుకొని
సీతారాముల జంటంటూ లోకం నిత్యం పొగడని....!

స్వర్గంలోనే ఆ బ్రహ్మ ఎవరికీ ఎవరో ముడిపెడతాడు
భువిపై వారిని ప్రతిమలు చేసి ఆటలు ఆడిస్తుంటాడు
ముడిపడు బొమ్మల్ని ఏకం చేసి చిరునవ్వును చిందిస్తాడు
దివినుండే ఆ జంటకు మనసారా తన దీవెనలందిస్తుంటాడు.......!

నీ నేను

ఇన్నాళ్ళు ఓ స్నేహంగా వెన్నంటే ఓ తోడుగా
ఈరోజే సరి కొత్తగా బంధం అయ్యెను నేరుగా
మనసార మనసిచ్చిన మనిషే నా ఎదురుగా
చుస్తే నా కళ్ళల్లో ఆనందం పొంగెను వరదగా
 
నూరేళ్ళు.......
             నా శ్వాస లో ఊపిరివై
            నా చేయి వదలని నేస్తంవై  
            నా ప్రతి అడుగులో మార్గంవై
            నా ప్రతి పలుకులో చిరునవ్వై
            నాలో నీవై ....... నీలో నేనై
            ఒకరికి ఒకరై మిగిలే కధ మనమై
            తరగని ప్రేమ పంచుతూ......
            మరువని సంతోషం జత చేస్తూ......
            ..............ఉంటావని కోరుతూ
                                             ................నీ నేను

కుడి అని ఒకటి ఎడమని ఒకటి

కుడి అని ఒకటి ఎడమని ఒకటి
దారులు చూపెను నాకే తలకొకటి
ముందుకు ఒకటి వెనకకి ఒకటి
అడుగులు వేసెను  నేనే నెలకొకటి

అడగక సలహాలిచ్చే  వారే ఒకరా యిద్దర నూటొకటి  
నిన్నే నువ్వు నమ్మకపోతే బ్రతుకంతా చిమ్మ చీకటి
 
ఆలోచిస్తే నిరంతరం అందనిదంటు ఉంటుందా
అన్వెషిస్తే అనుక్షణం ఎంతటిదైన ఉంటుందా
 నేనేవరంటు  ఆలోచిస్తే జవాబు దరికే వస్తుందా
మనిషిన మనిషిని చూస్తూ ఉంటె దైవం అయినా దిగి రాదా

కన్నులు మూసి సూన్యం అంటే ప్రపంచమే నవ్వుకోదా
నీలో లోలో వెలుగును నింపితే జగమంతా దాసోహమవదా

Monday, 18 July 2011

ఇదేనా ప్రేమని ఇన్నాళ్ళు చెప్పలేదు ఎవ్వరూ.....

where are you అని అనుకుంటే 
నేలోనే ఉన్నా అంటూ ఎదుటే నిలుచుంటే  
ఆ క్షణమే అనిపించింది ఇదేనేమో ప్రేమని 
ఇకపై నా మనసేమో మాట వినదని

male : 
నా మనసే....
అనుక్షణం నిను చూడాలంది
ఊ.. హూ.. అన్నా నన్నోదిలింది 
తీరా చూసి ఆరా తీస్తే నీలో చేరింది 
రమ్మంటుంటే నీ మనసుని తోడడిగింది            ||ఆ క్షణమే అనిపించింది|| 

lady :
ఓహో నీదా ఆ పిచ్చి మనసు.. జాలిగా వచ్చి చోటడిగింది
కాదనలేక కుర్చోమ్మంటే నా మనసంతా దోచేసింది
ఆ క్షణమే అనిపించింది ఇదేనేమో ప్రేమని 
ఇకపై నా మనసేమో మాట వినదని                 ||where are you||   

నింగి నుండి దూకినట్టు సంద్రమంత ఈదినట్టు ఏవేవో కలలు
నీ చుట్టూ తిరుగుతూ నీ ధ్యాసలో గడుపుతూ నిదురలేని కనులు
           ఇదేనా ప్రేమని ఇన్నాళ్ళు చెప్పలేదు ఎవ్వరూ..... 
           ఇదేనా ప్రేమని ఇన్నాళ్ళు చెప్పలేదు ఎవ్వరూ.....

                                                                          -పవన్

Wednesday, 29 June 2011

ఒక సాయంత్రం నా మదిలోని భావం నీతో చెబుతున్నా

అందమైన ఏ సాయంత్రం.. నా మదిలో ఒక చిన్ని రాగం
వినపడుతోందా నా మౌనం.. మనసంతా నువ్వే అనిదానర్ధం 
తనపై ప్రేమో ఏమో తెలియని వైనం.. తన జతలో ఏదో తెలియని ఆనందం 
చల్లని మేఘమా తనకి తెలుపుమా నా మనసులోని భావం
సంధ్యా రాగమా ధైర్యం చెప్పుమా నా పెదవి వీడనంటోంది మౌనం

నా గుండె ప్రతిక్షణం తనకోసమే తపిస్తోంది 
నా అడుగు నిరంతరం తనకేసే నడుస్తోంది
నా మనసు తనతో మాటాడి ప్రేమ తెలుపుతానంటోంది
కన్ను కన్నుతో జతకట్టి జవాబుకై ఎదురుచూస్తోంది 
నా పాదం తనతో ఏడడుగులూ నడవాలని ఆరాటపడుతోంది

నా మౌన వేదన తన దరి చేరిందా
ఈ మధుర భావన తనలో కూడా దాగుందా 
ఇది ప్రేమే అని తనకైనా తెలిసిందా.....

                                                          ...............పవన్ 

ఎవ్వరు నువ్వు ఏమైపోయావు

అందని నింగివో అందే నేలవో 
అందీ అందని ఆశవో
ఎవ్వరు నువ్వో ఏమైపోయావో 
తెలుసుకోలేక తలచుకుంటున్నా 
తెలుసుకోవాలని తపనపడుతున్నా....

ఎన్నాళ్ళు గడిచినా నీ మాట వినక
ఎన్నేళ్ళు వేచినా నువ్వు కానరాక 
ఎన్నాలైనా నిన్ను చూసి  
నిన్నో మొన్నో చూసినట్టుంది 
ఎన్ని నెలలైనా నిన్ను కలిసి
నీ ధ్యాసలోనే మనసు గడుపుతోంది.....

కలవా.... కనుమరుగైపోయావు
న్నీరువా... కరిగిపోయావు 
ఎదురుచుస్తూ కలవరిస్తూ
నీకోసం వేచి ఉంటా
ఏనాటికైనా నిన్ను చేరుకుంటా....


                             ..............పవన్ 

నేస్తమా... నా నేస్తమా...


కదిలే కాలంలా వచ్చావు
కన్నులు తడిపి పోయావు 
నేస్తమా ఇది నీకు న్యాయమా 
కాలంలా తరిగిపోకుమా
మంచులా కరిగిపోకుమా
నీటిలో రాతలా చెరిగిపోకుమా
కలలో కలతలా చెదిరిపోకుమా
చేతిలోన చేయి వేసి విడిచిపోకుమా.......  

                                           .................పవన్ 

ఈ జీవితాన ఏమిటి నువ్వు సాధించింది

కడుపుతీపిని తెంచుకుంటూ
కన్నవారిని గాలికొదులుతూ 
గాడి తప్పుతు తీరుతెలియక 
తప్పటడుగులు వేసుకెల్తూ 
తప్పులెన్నో చేసుకెల్తూ 
కర్కసంగా  ప్రవర్తిస్తూ 
మద్యమత్తుకి బానిసౌతూ 
సాగిపోతూ తాగిపోతూ
తిరుగుతున్నా ఓ మనిషీ
ఎందాకా ఈ దారితప్పిన నీ పయనం 
కాలమంతా కరిగిపోతూ 
వయసు మొత్తం వ్యర్ధమౌతూ 
డాబుకంటూ డబ్బుపొతూ
అప్పుకోసం చెప్పులరుగుతూ 
అలిసిపోతూ సొలిసిపోతూ 
అర్ధమెరుగని ప్రశ్నమౌతూ
ఈ తీరుగ నిలిచి చూస్తూ 
గతమంతా గుర్తుకొస్తూ 
తప్పులన్నీ గుండె దొలుస్తూ 
అడుగు అక్కడే ఆగిపొతూ  దాగిపొతూ 
లోకం చూపుకి సిగ్గుపడుతూ   
ప్రాణమంతా గాలికొదులుతూ 
గుణపాఠంగా మిగిలిపోతూ వదిలిపోతూ

                                 ................పవన్

ఇదే నా హైదరాబాదు....

కోటి కళలతో కోలువైనదీ హైదరాబాదు..
మతి చెదిరే ఈ అందాల హరివిల్లుకు జిందాబాదు..
ఏమని వర్ణించను.. ఎన్నని వర్ణించను..
రంగు రంగుల ఈ రంగవల్లిని ఏ దేవుడు సృష్టించెను..

మనసుదోచే అందాల అప్సరసలు..
గుండెదోచే వంటల ఘుమఘుమలు..
రవీంద్ర లలితకళా కళ్యాణి రాగాలు..
చరిత తెలిపే గోల్కొండ ప్రాకారాలు..

జంట నగరాలు దీని రెండు కళ్ళు.. 
రేయిని కూడా పగలని తలపించే రహదారులు..
వేదాంత భావాలు.. ఆధ్యాత్మిక చింతనలు..
మనిషిలోని మానవత్వాన్ని లేపే మహనీయ గాధలు..
అబ్బురపరిచే కమనీయ దృశ్యాలు.. 
ఆశ్చర్యపరిచే ఎన్నో వింతలూ విశేషాలు.. 
అలరించే నృత్య నైపుణ్య కేలిలు..
నవీన నాగరికతలెన్నో అడుగడుగునా మెదులు..  

రాజ్యాంగం రాజకీయం మంత్రివర్గం కలబోసినా మహానగరం
సర్వమత సౌభ్రాతృత్వం భిన్న జాతుల సమీకరణం ఈ భాగ్యనగరం 
ఎందరో మహానుభావులు రాజ్యమేలిన ఆదర్శనగరం ఈ ఆనందనగరం 
వంద ఏళైనా వన్నె తగ్గని వ్యాపారనగరం ఈ వైభోగానగరం....!  

                                        ..............పవన్ 

అనుభవించు రాజా... అనుభవించు రాజా..

అనుభవించు రాజా... అనుభవించు రాజా..
తోచిందే చేసుకుపోరా.. రోజంతా జల్సా చైరా..
నచ్చినట్టే  చిందులైరా .. నచ్చకుంటే ఏ పనైనా వదిలిపోరా..
అనుభవించు రాజా.. అనుభవించు రాజా..

అనాధవైతే ఇంకా బెటరు అడిగేవాళ్ళే ఉండరు కదరా..
ఆలస్యంగా ఇంటికి పోయినా దొబ్బేవారికి దూరం కదరా..
బీడీ పట్టు.. బ్రాంది కొట్టు ఎవడేమంటాడో అదీ చూడు..
నీతులు చెప్పే అన్నా ఉండడు.. బూతులు తిట్టే బాబు ఉండడు..

బాధలు ఉండవ్.. బెంగాలు ఉండవ్.. బాధ్యతలంటూ అసలే ఉండవ్ 
అప్పులు ఉండవ్.. సొప్పులు ఉండవ్.. దాచాలన్న కోరికలుండవ్
వొండుకు తింటే ఒకటే కూర.. రోడ్డున పడితే రకాలు ఎన్నో
ఇల్లే ఉంటే ఒకటే చోటు.. ఊరున పడితే రూమ్లు ఎన్నో 
care of అంటూ address ఎందుకు.. post office కి పొతే సరిపోదా
lockerలంటూ bankల చుట్టూ తిరగడమెందుకు.. ఖర్చు పెడితే పనైపోదా

కష్టం అంటూ చూసే వాళ్లకి సాయం చేస్తూ సాగిపో..
అనాధనంటూ  feelఅయిపోకు లోకం అంతా చుట్టాలనుకో..

                                                                      ..............పవన్   

Sunday, 26 June 2011

నీతోనే... నీలోనే....


నీ జడకోప్పున రోజాలా ఎందుకు
నీ పాపిట 
సింధూరం నూరేళ్ళు నీతోనే ఉంటా 
నీ వెంటే నీడలా వెలుగులో మాత్రమే ఎందుకు
నువ్వు పీల్చే శ్వాసలా అనుక్షణం నేతోనే ఉంటా.....

తుమ్మే
ను కాను నేను.. పువ్వు పువ్వు పై వాలిపోను 
న్నీరును కాను నేను.. కష్టాలలో నిన్నోదిలిపోను 
నాలో సగం కావు నువ్వు.. నేనే నువ్వై పోయావు
కన్నులలో నేవే నిండావు.. నాకు ఎటు చూసినా నువ్వే కనపడుతున్నావు....

నీ వెలి మెట్టెలా నేతోనే ఉంటాను
నీ గుండె చప్పుడులా నేలోనే ఉంటాను
నీ కాలి మువ్వలా 
నీకోసం సవ్వడి చేస్తాను
నీ మెడలో సూత్రంల నిత్యం నీ హృదయంలో దాగి ఉంటాను....  

                                              ............పవన్

ఓ బాటసారీ తెలుసుకో ఇకనైనా

లోకంలో ఏనాడైనా
తొంగి చూసావా ఏ మూలైనా
ఏ మూల చూసినా ఏ నెల వెతికినా
అర్ధం కాని విషయాలెన్నో అడుగడుగునా....

నోరులేని సంద్రానికి హోరు ఎలాగో తెలిసేనా..
ప్రాణానికి మూలమేమిటో  తెలుసుకోగలనా..
మనిషినోదిలి ఆత్మా ఎటుపోవునో జవాబు దొరికేనా....

అలలు లేని సంద్రాన్ని చూడగలనా
పగలులేని ప్రపంచాన్ని వెతకగాలనా
ఎడారిలో మంచుకొండలో ఆటలాడగలనా
వింతలన్నీ జతచేర్చి కొత్తలోకం సృష్టించగలనా

అందుకే ఓ బాటసారీ
తెలుసా నీ జననం..
కనుగోనగాలవా నీ మరణం..
ఏదో ఒక పయనం..
చేస్తుంటేనే నీ గమనం.....!
                                                  ........పవన్

ఇకనైనా మేలుకో నేస్తమా....


ఇది జీవన తరంగామా
లేక మరణ మృదంగామా
అవినీతి జలగల ప్రపంచమా
నేర రావణ సామ్రాజ్యమా....
 
కలియుగం కలుషితం
దారితప్పిన యువతరం
కాలకూటపు రాజకీయం 
కారుచీకట్లో జీవనం 
మోసం దగా దౌర్జన్యం
లేని సమాజం మాకు బహుదూరం  
మంచి మానవత్వం పేరుకైనా
మాలో చూడలేని గుణం
కరుకుగా ఉన్నా ఇది నిజం
ఇకనైనా మేలుకో నేస్తం  

                                      ........పవన్

Saturday, 25 June 2011

ఆవేశపడకు నేస్తమా అలోచించి చూడుమా....

ఆవేశం ఆక్రోశం వీడి చూడు భాయి
ఒడిదుడుకులు జీవితాన ఎన్నో ఉంటాయి
వెనకడుగు ఒక్కటైనా వెయ్యమాకురోయి
ప్రతి అడుగు ఆచి తూచి వేసి చూడవోయి.....

వేలెత్తి చూపిన చేతులు వెన్ను తట్టుతాయి
వదిలిపోయిన సంతసాలు చుట్టూ చేరుతాయి
భంగపడ్డ నిన్ను చూసి నవ్వినా నోళ్లన్ని
నీ గెలుపు చూసి ఒకటి ఒకటిగా మూతపడతాయి....

ఎవరండీ పుట్టుకతో గొప్పవారు
కష్టపడి పైకోచ్చినవారేగా అందరూ
ఎత్తుకెదిగిన వారిపై పుస్తకాలు రాస్తారు
దండ వేసి దండమేట్టి దేవుడిని చేస్తారు
లేదంటే వారి పేరు లెక్కల్లో తీసేస్తారు 
పేరైన తలవకుండా గాలికి వదిలేస్తారు.....


                                                 ........................పవన్

ఇది మా స్నేహం

ఎవరేమన్నా మాది ఒకే ప్రాణం
ఏదేమైనా మేము కలిసే ఉంటాం
ఇష్టమైన కష్టమైన ఏపనైన కలిసే చేస్తాం
మంచైనా చెడ్డైన ఒకరికొకరం తోడుంటాం....!
 
బాధపడితే ఒదారుస్తాం
బాధపెడితే అంతు చూస్తాం
సవాళ్ళేనైన ఎదిరిస్తాం
తప్పు చేస్తే తలొంచుతాం....!

మాలో మేము గొడవ పడతాం
గంట గంటకీ కలిసిపోతాం
మంచోళ్లమంటే నవ్వుకుంటాం
ఎదవలమంటే ఒప్పుకుంటాం......!

                                                                          .........పవన్

Thursday, 23 June 2011

అవును.... వీళ్ళా మనుషులు

వీళ్ళా మనుషులు వీళ్ళా మనుషులు
చెబుతా వినండి వారి బ్రతుకులు........

మొహమ్మీద ఉమ్ముపడితే తుడుచుకుపోతున్నారు
నెత్తిమీద పిడుగు పడితే నాకేమని పోతున్నారు
తప్పు ఒప్పులుంటాయని ఎప్పుడో మరిచారు
సిగ్గు ఎగ్గులెందుకులే అని గాలికి వదిలేశారు

మనిషి చచ్చిపోతుంటే  చిత్రం చూస్తుంటారు
మనసు ఛిద్రమవుతున్నా  పట్టనట్టు పోతారు
పేద ప్రజల గుండె చీల్చి లంచాలని కొందరు
ఎగిరిపడ్డ ఎంగిలాకు ఏరుకుతిని కొందరు
చావలేక బ్రతకలేక బ్రతుకుతున్న కొందరు
రకరకాల ముసుగులేస్తూ మరి కొందరు
పాలకులను గాడిదల్లె మోస్తున్నవారేగా అందరూ

బానిసల్లె బ్రతుకుతూ బ్రతుకు బండి లాగిస్తూ
                                       ఇంకా ఎన్నాళ్ళు.... 

                                       ఇంకా ఎన్నేళ్ళు ....


                                                     ........................పవన్